తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @5PM

By

Published : Sep 13, 2020, 5:01 PM IST

1. ముస్తాబైన పార్లమెంట్

వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంట్​ ముస్తాబైంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా పరీక్షలు చేయించుకుని.. అందులో నెగెటివ్​ వస్తేనే సమావేశాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. యాదాద్రిలో కేసీఆర్

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ... ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని... క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించి... అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. బిల్లుల ఆమోదమే లక్ష్యంగా...

లోక్‌సభలో పెండింగ్ బిల్లులు ఆమోదమే లక్ష్యంగా అజెండా రూపొందించారని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సమావేశాల్లో జీఎస్టీ నిధులు, కరోనా, వలస కార్మికుల సమస్యలపై చర్చించాలని కోరారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. నాణ్యతలో రాజీ పడొద్దు

ప్రభుత్వం వందశాతం రాయితీలో అమలు చేస్తున్న చేపపిల్లల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మత్స సహకార సంఘాలపైనే ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా చేపపిల్లల్ని అందించకపోతే నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపాలని ఆయన మత్సకారుల్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఆలయాలకు మహర్దశ

రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ రానుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్​లో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రాజరాజేశ్వరి ఆలయ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. భార్య ఒప్పుకోలేదని..

తన ఇద్దరు కుమారులను కిరాతకంగా చంపి.. ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ బారాఘట్​ జిల్లాలో జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లిన తన భార్య.. తిరిగి ఇంటికి రావటానికి నిరాకరించటం వల్ల మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. రాజకీయ తుపాన్లు ఎదుర్కొంటా!

ఎలాంటి రాజకీయ తుపాన్లు వచ్చినా ఎదుర్కొంటానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే వెల్లడించారు. మౌనంగా ఉన్నంత మాత్రాన తన వద్ద సమాధానాలు లేవని కాదన్నారు. కంగనా రనౌత్​, కరోనా అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు శివసేన అధినేత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రాత్రికి రాత్రి చైనా స్కెచ్

చైనా కపటబుద్ధి గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది. పంచశీల ఒప్పందం నుంచి బ్రిటన్​తో ఒప్పందాల వరకు తుంగలోతొక్కి దుస్సాహసాలకు పాల్పడింది. తాజాగా పాంగాంగ్​ సరస్సు వద్ద భారత్​ను కూడా ఇలానే మోసం చేయాలని ప్రయత్నించింది. చైనా తీరుపై అనుమానంతో భారత్​ నిఘా వేయటం వల్ల అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఐపీఎల్​కు రుతురాజ్ దూరం​!

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్​ గైక్వాడ్ యూఏఈలో ప్రాక్టీస్ ప్రారంభంలోనే​ కరోనా బారిన పడ్డాడు. తాజాగా ఇతడికి మరో రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. బన్నీ మాస్ లుక్ చూశారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ కొత్త లుక్​ నెట్టింట వైరల్​గా మారింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details