తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

etv-bharat-top-ten-news
టాప్​టెన్​ న్యూస్​ @5PM

By

Published : Sep 10, 2020, 4:59 PM IST

1. శాసనసభ ముందుకు మరో నాలుగు బిల్లులు

రాష్ట్రంలో శాసనసభలో మరో నాలుగు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సర్కార్‌ తీసుకొచ్చింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును మంత్రి సబిత ప్రవేశపెట్టగా... మూడు బిల్లులను హరీశ్‌రావు తరపున మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. అనిశా ఆఫీసులో నిందితులు

ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్​ను అనిశా అధికారులు బంజారాహిల్స్​లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనిశా న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. మూఢనమ్మకాలకే ప్రాధాన్యం

రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణంపై ఎంపీ రేవంత్​ రెడ్డి ఎన్జీటీ కమిటీకి ఫిర్యాదు చేశారు. సచివాలయం హుస్సేన్​సాగర్ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఒక కిలోమీటర్ పరిధిలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని 2001లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్​లోని లక్డీకాపూల్ అరణ్య భవన్‌లో ఎన్జీటీ కమిటీ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సీబీఎస్​ఈ చేతిలో లేదు

ఈ నెల 22 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్​ఈ ఏ విధంగానూ సహాయపడకపోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పై చదువుల కోసం జరిగే అడ్మిషన్ల ప్రక్రియ సీబీఎస్​ఈ చేతిలో ఉండదని పేర్కొంది. పరీక్షల సమయానికి అనేక వర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందన్న పిటిషనర్​ వాదనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. విపక్షాల అభ్యర్థిగా మనోజ్

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ పదవికి ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాలన్నీ కలిసి బిహార్​ ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝాను ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దింపాలని నిర్ణయించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. బెంగళూరును ముంచెత్తిన భారీ వరదలు

కర్ణాటకవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి కురిసిన వానలకు బెంగళూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చిత్రదుర్గ ప్రాంతంలో ఓ ట్రాక్టర్​ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. పిల్లుల్లో కరోనా యాంటీబాడీలు

కరోనా ఇన్నాళ్లూ మనుషులపైనే తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు పిల్లులపైనా ఈ రక్కసి కోరలు చాచిందట. ఇప్పటివరకు అంచనా వేసిన వాటికంటే ఎక్కువ సంఖ్యలో పిల్లుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. అయితే వైరస్​ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండడం వల్ల అవి మరణించట్లేదని పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రిలయన్స్ దూకుడు

హెవీవెయిట్​ షేర్ల దూకుడుతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 646 పాయింట్లు పుంజుకుని 38,840 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,449కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. యూఏఈ వెళ్లింది అందుకోసమేనా!

సెప్టెంబర్​ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం అభిమానులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో ఫ్రాంచైజీలు.. పాలకమండలి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సమాచారం. జట్లు అడిగిన కొన్ని సమస్యలను పాలకమండలి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10.సుశాంత్​ది హత్య అనలేదు

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్​పుత్​ది హత్య అని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేసింది అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండే. తాజాగా ట్విట్టర్​లో ఇందుకు సంబంధించి ఓ వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details