తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

By

Published : Sep 9, 2020, 6:59 PM IST

1. కేంద్రం చేసింది ఏం లేదు

కరోనాపై కేంద్రం మాటలు చెబుతోందని.. సాయం మాత్రం చేయట్లేదని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకూ ఇచ్చిందని స్పష్టం చేశారు. రుణాలు రీస్ట్రక్చర్‌ చేయాలన్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి అనేక కథలు చెబుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. శ్రావణి ఆత్మహత్యకు కారణం వాళ్లే

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు కారణం నేను కాదని దేవరాజ్​ రెడ్డి తెలిపాడు. కుటుంబ సభ్యులతో పాటు సాయి అనే వ్యక్తే కారణమంటూ ఆరోపించాడు. గతంలో కూడా తనపై తప్పుడు కేసులు బనాయించారని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యం..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ ట్యాంక్​లోని ఎస్ఈసీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. భాజపాకు స్వామి అల్టిమేటం

ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ భాజపాకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్​ఛార్జ్​ అమిత్​ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. భాజపా ఐటీ విభాగం.. ట్విట్టర్​లో తనపై దాడి చేస్తోందని ఇటీవలే ఆరోపించారు స్వామి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం స్టే

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. ఈ చట్టం రాజ్యాంగ ప్రామాణికతను బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంలో దాఖలైన వ్యాజ్యాలను విచారించిన అనంతరం.. ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఆ గ్రామం- కరోనాకు చాలా దూరం!

దేశ నలుమూలల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటికీ ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలోని మనా గ్రామంలో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇందుకు ఆ గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయమే కారణం. మే నెల నుంచి గ్రామానికి రాకపోకలను నిలిపి వేసి పూర్తి లాక్​డౌన్​ను విధించుకున్నారు.

7. నోబెల్​ రేసులో ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 'నోబెల్​ శాంతి బహుమతి 2021'కి నామినేట్ అయ్యారు. యుఏఈ-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ట్రంప్​ పేరును ప్రతిపాదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రిటైర్మెంట్​ జీవితం సాఫీగా ఇలా

పదవీ విరమణ తర్వాత చింతలేని జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు ఖర్చులకు సరిపడా సేవింగ్స్ మన దగ్గర ఉండటం ముఖ్యం. లేదంటే ఇబ్బందులు తప్పవు. అందుకే.. ఉద్యోగం ప్రారంభించినప్పటి నుంచే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ విషయంలో పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణుల సూచనలు మీకోసం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. టీ20 ర్యాంకింగ్స్ విడుదల

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్​ క్రికెటర్​ డేవిడ్​ మలన్​.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్​కు చెందిన బాబర్​ అజామ్​ను రెండో స్థానానికి నెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. బైకుల్లా జైలుకు రియా

సుశాంత్​ కేసులో మాదకద్రవ్యాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను.. బుధవారం జైలుకు తరలించారు. 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీలో భాగంగా.. సెప్టెంబర్​ 22 వరకు ఆమెను బైకుల్లా మహిళా జైలులో ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details