1. భారత్ బయోటెక్ కృషి అభినందనీయం
భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రసంశలు కురిపించారు. కరోనా వాక్సిన్ కోసం భారత్ బయోటెక్ చేస్తోన్న కృషిని అసెంబ్లీలో కొనియాడారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కేంద్రం చేసింది ఏం లేదు
కరోనాపై కేంద్రం మాటలు చెబుతోందని.. సాయం మాత్రం చేయట్లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకూ ఇచ్చిందని స్పష్టం చేశారు. రుణాలు రీస్ట్రక్చర్ చేయాలన్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణ వచ్చి అనేక కథలు చెబుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సహించేది లేదు
కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేయడం దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధిక ఛార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మన నేతలపై క్రిమినల్ కేసులు
రాజకీయ నేతల నేర చరిత్రపై కొత్త విషయం బయటకువచ్చింది. దేశవ్యాప్తంగా 4,442 మంది ప్రజా ప్రతినిధులు క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో 2,556 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే. నేతలపై ఉన్న క్రమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ హైకోర్టులు దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయం బయటకువచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తగ్గిన చిన్నారుల మరణాల రేటు
గత 30 ఏళ్లలో దేశంలోని చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది ఐరాస. 1990లో కోటీ 25 లక్షల మంది మరణించగా.. 2019 నాటికి ఈ సంఖ్య 52 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.