1. సీఎం కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నాగిరెడ్డి ఇటీవల పదవీవిరమణ చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పార్థసారథిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఉస్మానియా కూల్చాల్సిందేనా?
హైదరాబాద్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా.. వంటి అనేక అంశాలను చూడాల్సి ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆస్తుల జప్తు
బీమావైద్యల సేవల కుంభకోణంలో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఎంఎస్ సంయుక్త సంచాలకురాలు పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మి ఆస్తులకు జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంయుక్త సంచాలకురాలు పద్మ, ఆమె కుంటుంబసభ్యులు, బినామీల పేరు మీద రూ.8.55కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు
అరుణాచల్ ప్రదేశ్లో గల్లంతైన ఐదుగురు.. తమ వద్దే ఉన్నట్టు చైనా అంగీకరించింది. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 400 ఏళ్ల నాటి చెరువు
ఆ చెరువు 12 గ్రామల దాహార్తిని తీరుస్తోంది. 400 ఏళ్ల క్రితం తవ్వించినట్లు చెబుతున్న చెరువును ఇప్పటివరకు ఇంకిపోవడం ఒక్కసారి కూడా చూడలేదట అక్కడి ప్రజలు. మరి ఆ చెరువు ఎక్కడ ఉంది. అసలు దాని వెనుకున్న కథేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.