తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM

By

Published : Sep 8, 2020, 5:00 PM IST

1. ఐదు కోట్లు దాటిన కరోనా పరీక్షలు

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 5 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 10 లక్షల 98వేల 621 టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పార్థసారథి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్​గానూ సేవలందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా?

రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షాలను తొక్కేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి కేవలం ఆరు నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్​ను పునరుద్ధరించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని జీవన్​ రెడ్డి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అంతర్వేదిలో ఉద్రిక్తం

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్వేది వచ్చిన మంత్రులను వీహెచ్‌పీ, భజరంగదళ్ సంస్థలు నిలదీశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ నూతన డిప్యూటీ ఛైర్మన్​ పదవికి.. విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్​. ఇదేే విషయంపై ఇతర పార్టీలను సంప్రదిస్తామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. సరిహద్దులో మహిళా వైద్యులు

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఐటీబీపీ కీలక నిర్ణయం తీసుకంది. లద్దాఖ్​లోని ఫార్వర్డ్​ లొకేషన్లకు తొలిసారిగా మహిళా వైద్యులను పంపించింది. ఇందుకోసం నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. జవాన్లకు వైద్య సేవలు అందించే బాధ్యతలను ఈ మహిళా డాక్టర్లు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. చైనా కవ్వింపు చర్యలు

సరిహద్దు విషయంలో యుద్ధం చేయాల్సి వస్తే చైనా యుద్ధం గెలవలేదనే అపోహలో భారత్​ ఉందన్నారు చైనా అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకుడు హు షిజిన్‌. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసం చైనా సైనికుల్లో ఉందని.. పీఎల్​ఏను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. సెన్సెక్స్ 52 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, విద్యుత్​ రంగ షేర్లతో మిడ్​ సెషన్​లో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్​ 52 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. బుమ్రా ఒక్కడే...

ఐపీఎల్​ కోసం చేస్తున్న ప్రాక్టీసులో భాగంగా ముంబయి ఇండియన్స్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. ఆరుగురి బౌలింగ్​ యాక్షన్​ను చేసి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతమైన లైక్​లను అందుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. రియా చక్రవర్తి అరెస్ట్

సుశాంత్ రాజ్​పుత్​ కేసులో నటి రియా చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆమె సోదరుడు షోవిక్, మేనేజర్​ శామ్యూల్​ మిరండానూ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details