మాజీ రాష్ట్రపతికి కరోనా
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్రణబ్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నీలి విప్లవం
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలోకి చేప పిల్లలను విడుదల చేశారు. ఇప్పుడు 5 లక్షల చేపపిల్లలను వదిలామని.. మొత్తం 30 లక్షల పిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కృష్ణమ్మ పరుగులు
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. వారం రోజులపాటు ఇలాగే కొనసాగితే... జలాశయం నిండుకుండలా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కుటుంబ ఆస్తిగా మిగిలిపోతుంది
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేంద్రం పంపించే నిధులను దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2 కేజీల గోల్డ్ ఫిష్
రోజులాగే చేపల వేటకు వెళ్లిన జాలరికి అనుకోని రీతిలో రెండు కేజీల గోల్డ్ ఫిష్ వలకు చిక్కింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా ఈపూరు గ్రామస్థులు దానిని ఆసక్తిగా తిలకించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎంపీపై కుర్చీలతో దాడి
బిహార్‌లో వరదల కారణంగా అవస్థలు ఎదర్కొంటున్న బాధితులు... సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్పై కుర్చీలతో దాడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పరీక్షల రద్దు లేదు!
డిగ్రీ పరీక్షలు రద్దు చేసే హక్కు రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది యూజీసీ. ఈ సెప్టెంబర్ ఆఖరుకల్లా పరీక్షలు నిర్వహించాలని, ఏమైనా మార్పులుంటే యూజీసీ స్వయంగా ప్రకటిస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కుక్కర్‌తో క్లీన్ చేసుకోండి..
కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ఫేస్‌మాస్క్‌లు పెట్టుకోవడం ఇప్పుడు తప్పని సరిగా మారింది. రోజంతా వాటిని పెట్టుకోవడం వల్ల ఎన్నో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములకు అవి ఆవాసాలుగా మారుతున్నాయి. మరి వాటిని కేవలం సబ్బుతో శుభ్రం చేస్తే సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. మాస్క్‌లను శుభ్రం చేసేందుకు ఓ సులభమైన ప్రక్రియను కనుగొన్నారు. అదేమిటో మీరూ తెలుసుకోండి మరి! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాజస్థాన్ జట్టులోకి కోహ్లీ
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో బెంగళూరుకు కాకుండా రాజస్థాన్‌కు కోహ్లీ ఆడనున్నాడంటూ వస్తున్న వార్తలపై 'ఆర్ఆర్' ఫ్రాంఛైజీ స్పందించింది. కోహ్లీ వస్తే తీసుకుంటామని కానీ ఒక్క షరతు ఉందని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎందుకు అలా చేశావ్
సిల్క్‌స్మిత బయోపిక్ 'డర్టీ పిక్చర్' చేస్తున్న సమయంలో చాలామంది తనకు పిచ్చిపట్టిందని భావించినట్లు నటి విద్యాబాలన్ చెప్పింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.