మరో ఎమ్మెల్యేకు కరోనా
హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. 3 రోజుల క్రితం ఎమ్మెల్యే భార్యకు కొవిడ్ నిర్ధరణ కాగా.. నిన్న ఇద్దరు కుమారులు, వంట మనిషితో కలిసి ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వారందిరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భూములు స్వాధీనం
హైదరాబాద్ టోలీచౌకిలో హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ భూములను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కిన్నెర కన్నెర్ర
ఏళ్లు గడుస్తున్నా ఆ గిరి బిడ్డల కష్టాలు మాత్రం తీరడం లేదు. వానాకాలంలో పంట పొలాలకు వెళ్లాలన్నా.. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. విద్యార్థులు బడికి పోవాలన్నా ప్రమాదకర రీతిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఆళ్లపల్లి మండలం మైలారం వదనున్న కిన్నెరసాని వాగులు దాటాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎస్ పదవీ కాలం పొడిగింపు
ఏపీ రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలపాటు ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చవితికి ప్రత్యేక రైళ్లు!
మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపాలని మధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.