కేసీఆర్ కీలక సమీక్ష
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లతో సమావేశమయ్యారు. నూతన సచివాలయ భవన నమునాపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఇదే అంశంపై కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. వాటిపై చర్చించి నమూనాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశం మనవైపు చూస్తోంది
కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరం - సమతుల్యత’ అంశంపై జినోమ్ వ్యాలీలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాయిదా కోరడమేంటి?
పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం ముందుకొస్తే.. అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయాలని కేసీఆర్ కోరడంపై మండిపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగ రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై గవర్నర్‌కు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అయోధ్య రామాలయం చూశారా?
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను విడుదల చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
29 ఏళ్ల తర్వాత
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. అయితే మోదీ అయోధ్యలో అడుగుపెట్టడం 29 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇంత కాలం ఆయన అక్కడకు వెళ్లకపోవడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.