హ్యాపీ రక్షాబంధన్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌదర్రాజన్ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని మార్గదర్శకాలను, ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బావి బలిగొంది
పొలంలో నాట్లు వేయడానికని వెళ్లారు. పనులు ముగిశాక కాళ్లు కడుక్కునేందుకని బావి వద్దకు వచ్చారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గురువుకు అండగా
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న ఆ విద్యార్థులు వారి గురువుకు ఏదో చేయాలని తపించారు. పూర్వ విద్యార్థులు చేయి చేయి కలిపి విద్యాబుద్ధులు నేర్పిన గురువుకి అండగా నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో విజృంభిస్తున్న వైరస్
ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,58,764 చేరింది. మరో 67 మంది మృతిచెందగా.. కొవిడ్ బారిన పడి 1,474 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అడ్వాణీ, జోషీకి ఆహ్వానం
అయోధ్యలో రామ మందిర భూమి పూజోత్సవ కార్యక్రమానికి ఎల్కే అడ్వాణీ, ఎమ్ఎమ్ జోషిని ఆహ్వానించలేదనే వార్తలను ఖండించారు ట్రస్ట్ అధికారులు. ప్రముఖులందరికీ సమాచారమిచ్చామని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.