1. అంబరాన్నంటిన సంబురాలు
రాష్ట్రవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలి పతంగులు ఎగురవేస్తూ సంబురాలు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కోడి పందేల్లో వివాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో జరుగుతున్న కోడి పందాల్లో కొంతమంది యువకులు ఘర్షణలకు దిగారు. పేకాటలో తలెత్తిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పతంగుల పండుగ
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. రంగురంగుల గాలిపటాలతో సికింద్రాబాద్ పరేడ్ మైదానం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మైదానానికి చేరుకుని గాలి పటాలు ఎగరవేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ముగిసిన అఖిలప్రియ కస్టడీ
ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మకరజ్యోతి దర్శనం
సంక్రాంతి పర్వదినాన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.