1. మూడోసారి డ్రైరన్
రాష్ట్రంలో మరో మారు కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ని సర్కారు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో ఈ డ్రైరన్ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న క్రమంలో వ్యాక్సినేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ డ్రైరన్ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'టీకాల పంపిణీకి ఏర్పాట్లు'
వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న కొవిడ్ నియంత్రణ చర్యలతోపాటు... వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై కేంద్రానికి ఈటల వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కిడ్నాప్ కేసు : పోలీసుల వేట
ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అపహరణ కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏ2గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1 నిందితురాలిగా మార్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తరుణ్ చుగ్ పర్యటన అందుకే!
దుబ్బాక, జీహెచ్ఎంసీ జోరునే రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కొనసాగించాలని భాజపా భావిస్తోంది. పక్కా ప్రణాళికలు, చేరికలు, పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా ముందుకు సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో బలం నిరూపించుకున్న కమలనాథులు గ్రామీణ స్థాయిలో పట్టు సాధించేందుకు విస్తృతంగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'దేశాన్నిరోడ్డు మీదకు తెచ్చారు'
దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. మోదీ నిర్ణయాలతో దేశం నడిరోడ్డులో నిలబడాల్సి వచ్చిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.