1. కొవాగ్జిన్ వినియోగానికి ఓకే
దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం తెలపాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సిఫారసు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో డ్రైరన్ సక్సెస్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 7 కేంద్రాల్లో రెండు గంటల పాటు డ్రైరన్ సాగింది. వివరాలను అధికారులు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అధికారులు..పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కృత్రిమ మేధ కీలకం: కేటీఆర్
ప్రగతిభవన్‌లో ఐటీశాఖ అధికారులతో కలిసి ఏఐ సక్సెస్ రిపోర్ట్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. కృత్రిమ మేధ విభాగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వ నిర్ణయాలు చాలా ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సంక్రాంతి వేళ 4,980 బస్సులు
పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు వినిపించింది. ఈ నెల 8 నుంచి 14 దాకా... 4980 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రామతీర్థం రగడ: కొండపైకి చంద్రబాబు
ఏపీలోని రామతీర్థం ఆలయంలో...శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశాన్ని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిశీలించారు. బోడికొండపైకి సహచర తెదేపా నేతలతో కలిసి... మెట్లమార్గం ద్వారా చేరుకున్నారు. గుడిపైకి చంద్రబాబు చేరుకునేసరికి ఆలయానికి తాళం వేసి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.