1. ముగిసిన ప్రచార పర్వం
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దత్తత తీసుకున్న సీఎం
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భాజపా కుట్రలకు తెరలేపుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు . నైతికతను మరిచిన జాతీయ పార్టీ చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కోటి డబ్బు..ఆ పార్టీ నేతదేనట!
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్ నుంచి తరలిస్తున్న కోటి రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్‌లో ప్రచారానికి తెర
బిహార్‌లో రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. రెండో విడతలో భాగంగా నవంబర్ 3న.. 94 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.