1. గీతం నిర్మాణాలు కూల్చివేత
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద కొన్ని కట్టడాలను.. రెవిన్యూ సిబ్బంది అధికారులు తొలగించారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం, ప్రహరీగోడను రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారు. జేసీబీ, బుల్‌డోజర్లతో అర్ధరాత్రి నుంచి కూల్చివేత మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సర్కారు బడిలో ప్లేస్కూల్, ఎల్‌కేజీ, యూకేజీ
పాఠశాల విద్యకు సంబంధించి కొత్త విద్యా విధానంలో మొత్తం 294 అంశాలపై మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. పూర్వ ప్రాథమిక విద్య, సిలబస్ మార్పు, 3-18 సంవత్సరాల వరకు నిర్బంధ ఉచిత విద్య, పరీక్షల్లో సంస్కరణలు తదితర వాటిని ఎప్పటిలోపు అమలు చేయాలో కేంద్రం ఇప్పటికే గడువు నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు
మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. గోదావరి ప్రాజెక్టులతో 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని.. కృష్ణా ప్రాజెక్టులతో మిగిలిన జిల్లాలు సుభిక్షమవుతాయని తెలిపారు. వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'మక్కలు కొంటున్నాం'
వానాకాలంలో పండించిన మొక్కజొన్న పంటను కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాలుకు1850 రూపాయల మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఓకే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.