1. సర్కారు అప్రమత్తం
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టులు సైతం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సీసీఎస్ దాడులు
హైదరాబాద్ బేగంపేట పిన్ ప్రింట్ టెక్నాలజీ లోన్ యాప్ కాల్‌సెంటర్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. గురుగావ్ కేంద్రంగా కాల్ సెంటర్ కొనసాగుతున్నట్లు గుర్తించారు. బేగంపేట, పంజాగుట్ట, మరో ప్రాంతంలోని పిన్ ప్రింట్ కాల్ సెంటర్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. యాసంగిపై మంత్రి సమీక్ష
యాసంగి పంట కాలంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల కొనుగోళ్లు సహా తాజా యాసంగి పంటల సాగు సరళి, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం, రసాయన ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'కేంద్రానిది పాత పాటే'
సాగు చట్టాలపై ఆమోదయోగ్య పరిష్కారం చూపుతామని హామీ ఇస్తే కేంద్రంతో ఎప్పుడు చర్చలు జరపడానికైనా సిద్ధమని చెప్పాయి రైతు సంఘాలు. కేంద్రం ఆదివారం తమకు పంపిన లేఖలో కొత్త అంశాలేమి లేవని, సాగు చట్టాల సవరణల గురించే మళ్లీ ప్రస్తావించిందని పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. డ్రోన్ల కలకలం
పాక్ కుట్రను మరోసారి తిప్పికొట్టింది భారత సైన్యం. సరిహద్దులో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న పాక్ డ్రోన్లను దళాలు గుర్తించాయి. అవి జారవిడిచిన 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.