1. ముగిసిన ప్రచార పర్వం
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్
సోమవారం భాగ్యనగరంలో భాజపా భారీ స్థాయిలో కుట్రకు పథకం రచించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ కుట్రలకు తెరలేపినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అల్లర్లు సృష్టించాలని చూస్తోంది: తెరాస
భాజపా నాయకులు నగరంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి, ఈసీ అదనపు సీఈవో బుద్ధ ప్రకాశ్‌ను కలిసి... శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పరామర్శించిన బండి సంజయ్
హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయం వద్ద ఆత్మహత్యకి యత్నించిన శ్రీనివాస్ అనే యువకుడు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న తను.. శ్రీనివాస్ విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కి తరలి వచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్‌లో ప్రచారానికి తెర
బిహార్‌లో రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. రెండో విడతలో భాగంగా నవంబర్ 3న.. 94 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.