1. తిరిగి అర్ధరూపాయే ఇస్తోంది: కేటీఆర్
తెలంగాణకు ఈ ఆరేళ్లలో కేంద్రం చేసింది శూన్యమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కేంద్ర ప్రభుత్వం... దేశంలో మరోచోట అభివృద్ధికి ఖర్చుచేస్తోందని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే... అదే కేంద్రం తిరిగి రాష్ట్రానికి కేవలం అర్ధ రూపాయి మాత్రమే ఇస్తోందని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది: ఉత్తమ్
డబ్బు సంచులతో భాజపా కాంగ్రెస్ నాయకులను కొనుక్కోవాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందని ఓట్లు అడుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం, భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వారికి మళ్లీ సాయం: బండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌లు భాజపాను నియంత్రించలేవని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కుత్బుల్లాపూర్ డివిజన్లో ఉద్రిక్తత
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ డివిజన్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బీ-ఫారాలకు రేపటి వరకు గడువు
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.