1. ధరణికి సిద్ధం కండి...
ధరణి పోర్టల్‌కు సంబంధించి... కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్ ధరణిని ప్రారంభించనున్నందున... పూర్తిస్థాయిలో సన్నద్ధత కావాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వారికి ఓటేస్తే అంతే...
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రయోజనం శూన్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా దౌల్తాబాద్ మండలం ముబారక్పూర్, తిరుమలాపూర్, హైమద్‌నగర్ గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'కేసీఆర్ బయటపెట్టాలి'
ఎల్లూరు లిఫ్టును పరిశీలించేందుకు వెళ్తున్న భాజపా నాయకురాలు డీకే అరుణను... వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పనుల్లో అవినీతి బయటపడుతుందనే అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పత్తి రైతు పరేషాన్...
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 19 నుంచి ప్రారంభించాల్సిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికే చేతికొచ్చిన పంటను భారత పత్తి సంస్థ(సీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ఆరబెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నలుగురు అక్కాచెల్లెళ్ల హత్య!
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మైనర్ బాలికలను గొడ్డలితో అతికిరాకంగా నరికి చంపారు దుండగులు. అక్కాచెల్లెళ్లయిన ఈ నలుగురిలో ఒకరిని సామూహిక అత్యాచారం చేసి.. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.