తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ టెన్​ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు

By

Published : Jul 19, 2020, 2:58 PM IST

Updated : Jul 19, 2020, 4:36 PM IST

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. సమీక్షకు వేళాయే!

ఇంజినీరింగ్​ విభాగాల ముఖ్యులతో రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. నీటిపారుదలశాఖ పునర్​ వ్యవస్థీకరణ ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పీవీ ప్రసంగాలతో...

పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవ కమిటీ గాంధీభవన్​లో సమావేశమైంది. వేడుకలకు సంబంధించిన ప్రణాళికలపై... కమిటీకి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి

ఖమ్మం జిల్లా కేంద్రంలో సంచార శౌచాలయాలను ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. నగరానికి వచ్చే మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 105కు చేరిన మృతులు

అసోంలోని 26 జిల్లాలు వరదలకు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా 27.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 2,700 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 47వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 105 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 161అడుగుల ఎత్తు, 5 గోపురాలు

161అడుగుల ఎత్తు, 5గోపురాలతో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఖరారు చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థకేత్ర ట్రస్టు. మహంత్​ నృత్య గోపాల్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీకి ట్రస్టు సభ్యులందరూ హాజరయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే'

కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా వైరస్​, దేశ జీడీపీ సహా చైనా దురాక్రమణల సమాచారాన్ని అధికార భాజపా వక్రీకరిస్తోందని ఆరోపించారు. భాజపా అబద్ధాలను సంస్థాగతం చేసిందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బీసీసీఐ జనరల్​​ మేనేజర్​ రాజీనామా!

భారత క్రికెట్​ బోర్డులో మరో కీలక పదవి ఖాళీ కానుంది. జనరల్​ మేనేజర్​గా ఉన్న​ సబా కరీం​ తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. బోర్డు, అతనికి మధ్య విభేదాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారత్​-ఈయూ ఒప్పందం కష్టమే!

సమీప భవిష్యత్తులో ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో వియత్నాంతో ఈయూ ఒప్పందం కుదుర్చుకోవడం భారత్​కు ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. బ్రెగ్జిట్ వంటి పరిణామాలు దీనికి మరో కారణంగా చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'తేల్చేది ఎన్​ఆర్​ఐలే!'

నవంబరులో జరిగే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్​ ఓటర్లు చాలా కీలకమని డెమొక్రటిక్​ పార్టీ నేత చెప్పారు. మిషిగన్​, పెన్సిల్వేనియా, విస్​కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో వాళ్ల ఓట్లే ఫలితాలను నిర్ణయిస్తాయని తెలిపారు. వారి మద్దతు సంపాదించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'పదేళ్లకు సరిపడా కథలున్నాయి'

'ఇస్మార్ట్​ శంకర్'​ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది నటి, నిర్మాత ఛార్మి. పూరి జగన్నాథ్​ సినిమాలన్నీ ఇకపై పాన్​ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు 10 ఏళ్లకు సరిపడా కథలు పూరీ సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jul 19, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details