1. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా
జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కేసీఆర్ వెంటనే స్పందించాలి: బండి
పీవీ సమాధి కూల్చేస్తామన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. స్టేడియంలో కేసీఆర్ సభ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం ముమ్మరం చేసింది. విపక్షాల విమర్శలు, వ్యూహాలను తిప్పికొట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి చోటులేదు'
సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై.. ప్రజలు కూడా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రైతులపై జల ఫిరంగులు
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు హరియాణా అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దిల్లీ వెళ్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.