తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM - 1PM టాప్​న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

By

Published : Aug 21, 2022, 12:59 PM IST

  • మద్యం స్కాంలో సిసోదియాకు లుక్​ఔట్​ నోటీసులు

దిల్లీ ఉప మఖ్యమంత్రి మనీష్​ సిసోదియాపై సీబీఐ లుక్​ఔట్​ నోటీసులు జారీ చేసింది. దీంతో దేశం విడిచి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీనిపై మనీష్​ సిసోదియా ఘాటుగానే స్పందించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలా కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

  • పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, ఆ గొడవలే కారణమా

హైదరాబాద్​లోని పాతబస్తీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • ఈసీజీ రూ.50, సీబీపీ రూ.30, మన హైదరాబాద్​లోనే, ఎక్కడంటే

ఏ చిన్న జ్వరం వచ్చినా వైద్యుడి దగ్గరకి వెళ్తే రకరకాల టెస్టులు రాస్తుంటారు. కొన్నిసార్లు అవసరం లేకున్నా ముందస్తు జాగ్రత్తగా చేయాలని చెబుతుంటారు. బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల్లో అన్నిరకాల టెస్టులు అందుబాటులో ఉండవు. ఒకవేళ వైద్య పరీక్షలు చేయించుకున్నా.. నివేదికలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి వారందరికీ నారాయణగూడ ఐపీఎం కేంద్రం అండగా నిలుస్తోంది.

  • నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు, తెదేపా నాయకుల ఆందోళన

ఏపీలోని పలాసలో తెదేపా నాయకుడు సూర్యనారాయణను పరామర్శించడానికి వెళ్తున్న నారా లోకేశ్​ను శ్రీకాకుళంలో పోలీసులు అడ్డుకున్నారు. పలాస వెళ్తున్న ఆయనను ఆమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన పార్టీ శ్రేణులు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

  • కన్నీరు పెట్టిస్తోన్న యువకుడి ఆత్మహత్య లేఖ

ఏపీలో వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా స్థానిక వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారంటూ, ఎస్పీకి రాసిన ఆత్మహత్య లేఖ కంటతడి పెట్టిస్తోంది.

  • పొలంలో నిధులున్నాయని స్వామీజీ మోసం, రూ 5 లక్షలతో జంప్​

పొలంలో నిధులు ఉన్నాయని దంపతులను మోసం చేశాడో దొంగ స్వామీజీ. ఐదు లక్షల డబ్బుతో ఉడాయించాడు. ఆలస్యంగా తేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • దొంగతనం నెపంతో యువకుడి దారుణ హత్య, కరెంట్​ స్తంభానికి కట్టేసి మరీ

హరియాణా సోనీపత్​లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపారు స్థానికులు. ఓ మొబైల్​ షాపులో ఫోన్​ చోరీ చేశాడని అనుమానించిన స్థానికులు యువకుడిని కరెంట్​ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువకుడు.. కాసేపటికి మరణించాడు. మృతుడిని ఝండ్​పుర్​ గ్రామానికి చెందిన అశోక్​గా గుర్తించారు.

  • దీపక్‌ హుడా అరుదైన రికార్డు

టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు.

  • త్రిష మరోసారి లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా

నటి త్రిషకు వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఇన్​స్టాగ్రామ్​లో ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్టే అందుకు కారణం. అసలేం జరిగిందంటే.

  • వారు శృంగారం పట్ల ఆసక్తి చూపరు, పెంపకమే కారణమా

శృంగారంపై పురుషులకు ఉన్నట్లుగానే మహిళల్లో కూడా ఆసక్తి ఉంటుంది. అయితే కొందరు మహిళలు మాత్రం అసలు సెక్స్​ అంటే ఆసక్తి చూపరు. ఇందుకు వారు అనుసరించే సభ్యత, సంస్కారాలే ప్రధాన కారణమనే వాదన ఉంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే

ABOUT THE AUTHOR

...view details