రూ.100 దాటిన పెట్రోల్ ధర
రాష్ట్రంలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధరలు(Petrol Price) రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిజామాబాద్. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రేపు ఈటల రాజీనామా
19 ఏళ్లుగా తెరాసతో ఉన్న బంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్... శాసనసభ్యుడి పదవికీ రేపు రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
బాధ్యతల స్వీకరణ
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్గా నియామకమైన భూపాల్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.కొత్త ఛైర్మన్ ఎన్నికయ్యే వరకు ఆయన ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'సైకిల్ గర్ల్'కు ప్రియాంక అండ
'సైకిల్ గర్ల్' జ్యోతి కుమారి తండ్రి మృతి పట్ల కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు జ్యోతితో ఆమె ఫోన్లో మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వైద్యుల రాజీనామా
మధ్య ప్రదేశ్లో దాదాపు 3,000మంది వైద్యులు రాజీనామా చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.