పైలట్ విధానంలో డిజిటల్ సర్వే
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'మూడో దశ ఎలా ఎదుర్కొంటారు?'
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు.... వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లు రద్దు చేశామని డీహెచ్ హైకోర్టుకు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మంత్రికి నిరసన సెగ
నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 2015లో కుబీర్ రోడ్డు విస్తీర్ణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని మంత్రిని నిలదీశారు. ఇప్పటివరకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆపరేషన్ యూపీ
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం ఆర్ఎస్ఎస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంస్థ అధినేత మోహన్ భగవత్.. గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీలోని ఆర్ఎస్ఎస్ కీలక ప్రతినిధులతో సమావేశం కానున్నారు. యూపీ అంశంపైనే వీరు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఉద్యోగులకు కొత్త రూల్
నిఘా సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం మాజీ ఉద్యోగుల నుంచి బయటకు పొక్కకుండా ఉంచేందుకు కేంద్రం నిబంధనలను సవరించింది. సంస్థలో పనిచేసిన విభాగం, సిబ్బంది వివరాలను బహిర్గతం చేయకుండా చూసేలా నూతన క్లాజ్‌ను అమలులోకి తెచ్చింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.