'వ్యాక్సినేషన్ ఆగొద్దు'
కరోనా పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలకు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులకు సూచించారు ప్రధాని. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రగతిభవన్ చేరుకున్న కేసీఆర్
సుమారు 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణకు ముందు నుంచే ఎర్రవల్లిలో ఉంటున్న కేసీఆర్... పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించటం వల్ల నేడు ప్రగతిభవన్‌కు విచ్చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, టీకాల కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్లాస్మాదానం ఎలా చేయాలి?
కరోనా మహమ్మారి ధాటికి యావత్ దేశం అతలాకుతలం అవుతోంది. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్లాస్మా థెరపీతో ఈ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. ఎంతో మందిని కాపాడవచ్చు. ఇంతకీ ఈ చికిత్స ఏంటి? ఎవరెవరు ప్లాస్మా దానం చేయవచ్చు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వర్షసూచన
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా... రేపు మాత్రం వడగండ్ల వానలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ పది రాష్ట్రాల్లోనే..
దేశంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72 శాతం.. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.