1.ఘోర రోడ్డుప్రమాదం
వారంతా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లారు. తమకిష్టమైన కూరగాయలు కొనుక్కున్నారు. సంతోషంగా అక్కడి నుంచి బయల్దేరారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న లారీ కారును ఢీకొట్టి బోల్తా పడింది. అప్పటిదాకా ఆనందంగా గడిపిన వారు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.కరోనా కట్టడి చర్యలు
హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మొదటి దశగా రానున్న 4 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.టీకా కావాలె..
టీకాల సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపించకపోవడం వల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.విజృంభిస్తున్న కొవిడ్
రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏకంగా ఐదు వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5వేల 93 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 15 మంది కొవిడ్-19కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.ఒక్కరోజే 1500 మరణాలు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,61,500 మందికి వైరస్ సోకగా.. 1501 మంది మరణించారు. లక్షా 23 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.