తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM

By

Published : Apr 18, 2021, 5:02 PM IST

1.కరోనా కట్టడి చర్యలు

హైదరాబాద్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మొదటి దశగా రానున్న 4 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రదేశాల్లో బ్లీచింగ్‌ పౌడర్​ను చల్లాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'టీకాల సమస్యను పరిష్కరించాలి'

కరోనా టీకాల సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత, పడకల కొరత లేదని... కేవలం కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే పడకలు లేవని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.నామినేషన్ల జోరు

నేడు ఆఖరి రోజు కావటంతో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నామినేషన్లు వెల్లువెత్తాయి. వరంగల్‌ ఎల్‌వీ కళాశాల, హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వద్ద ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా కోలాహలం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ప్రధాని సమీక్ష

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో కొవిడ్​ పరిస్థితులపై అక్కడి అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టెస్టింగ్​, ట్రాకింగ్​, ట్రేసింగ్​ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'నిరాశలో మమత'

బంగాల్​లో ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల తర్వాత.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిరాశ చెందినట్లుగా కనిపిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. 180 స్థానాలకుగాను జరిగిన ఈ పోలింగ్​లో 122 కంటే ఎక్కువ స్థానాల్లో భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'రాష్ట్రాలకు పూర్తి సహకారం'

కరోనా పోరులో రాష్ట్రాలకు అన్ని విధాలుగా కేంద్రం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. వైరస్​ను ఎదుర్కొనేందుకు వైద్య పరికరాలు, మందుల ఉత్పత్తిని, పంపిణీని రెండు రెట్లు పెంచినట్లు చెప్పారు. వాక్సినేషన్​ ప్రక్రియను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో కేవలం 92 రోజుల్లోనే 12 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.అక్కడ ఆంక్షలు పాటించాల్సిందే!

కరోనా ఉద్ధృతి తారస్థాయికి చేరిన నేపథ్యంలో అంతర్​రాష్ట్ర ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్​టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్​ను సైతం తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులపై ఏ రాష్ట్రాల్లో ఏఏ ఆంక్షలు అమలవుతున్నాయో తెలిపే వివరాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.మసీదులో కాల్పులు

అఫ్గానిస్థాన్​లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కాల్చిచంపారు గుర్తుతెలియని సాయుధులు. మసీదు​లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిపినట్లు నంగర్​హర్​ రాష్ట్ర గవర్నర్ జియా ఉల్​ హక్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.సత్తాచాటిన భారత బాక్సర్లు

పోలండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్​ ఛాంపియన్​షిప్​ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు క్వార్టర్స్​లోకి ప్రవేశించారు. ఒక మహిళ బాక్సర్​తో పాటు మరో నలుగురు క్వార్టర్స్​లోకి దూసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.రూ. 6.5 కోట్ల సెట్‌లో..

నాని కథానాయకుడిగా నటిస్తున్న 'శ్యామ్​ సింగరాయ్' చిత్ర నిర్మాణానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు తాజాగా చిత్ర బృందం ఓ భారీ సెట్​ వేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details