తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @1PM

By

Published : Apr 10, 2021, 12:56 PM IST

1.ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్ వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే అయేషా, అస్మా, అభీర్‌ అనే ముగ్గురు బాలికలు కనిపించట్లేదని వారి తల్లి తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.ఈడీ సోదాలు

ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్​ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు... సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నిదింతురాలైన దేవికారాణితో పాటు ఇతర నిందితుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ప్రైవేట్​ వైద్య కళాశాలల్లోనూ..

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ఎన్నికల వేళ బలగాల కాల్పులు

బంగాల్​లో నాలుగో విడత పోలింగ్​ జరగుతున్న వేళ​ కూచ్​బెహార్​ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్​ఎఫ్​ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీతల్​​కుచి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తమ రైఫిళ్లను లాక్కునేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఎక్స్​ప్రెస్​ వే దిగ్బంధం

కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా.. కుండ్లీ ఎక్స్​ప్రెస్ వేను దిగ్బంధించాయి రైతు సంఘాలు. దిల్లీలో కరోనా కేసులు విస్తృత స్థాయిలో పెరుగుతున్నప్పటికీ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశాయి. ఈ నెల 13, 14న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.సోనియా సమీక్ష

కొవిడ్​ కట్టడికి చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించేందుకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్​ నిల్వలు, వెంటిలేటర్లు తదితర వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఒకేసారి 22 మృతదేహాలు దహనం

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో కరోనాతో మృతిచెందిన 22 మందికి ఒకే శ్మశానవాటికలో ఒకేసారి దహన సంస్కారాలు నిర్వహించారు అధికారులు. శుక్రవారం ఒక్కరోజే అహ్మద్​నగర్​లో వివిధ ప్రాంతాల్లో మొత్తం 42 కొవిడ్ మృతదేహాలను దహనం చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.బ్యాంకులకు 'కొవిడ్'​ ముప్పు

కరోనా రెండో దశ విజృంభణతో దేశీయ బ్యాంకుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం తప్పదని అంతర్జాతీయ రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలు దీర్ఘకాలంలో మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రధాన రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశ జీడీపీ పుంజుకోడానికీ విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.'ఎంతో శ్రమించా'

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు పేసర్ హర్షల్ పటేల్. తనను కొనుగోలు చేసినప్పుడే యాజమాన్యం బాధ్యతలు వివరించిందని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.ఆ చిత్రాలకు అనుమతివ్వొద్దు..

నక్సలిజాన్ని ప్రోత్సహించే చిత్రాలకు సెన్సార్​ అనుమతి ఇవ్వరాదంటూ తీవ్రవాద నిరోధక ఫోరం(ఏఎఫ్​టీ) బృందం డిమాండ్​ చేసింది. చిరంజీవి, రానా కొత్త చిత్రాలైన 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాల్లో మావోయిస్టు భావజాలాన్ని చూపించే అవకాశం ఉన్నందున.. ఆ సినిమాలకు అనుమతి ఇవ్వరాదంటూ సెన్సార్​ అధికారులకు బృందం విన్నవించుకుంది. లేని పక్షంలో సినిమాల ప్రదర్శనను నిలిపేస్తామంటూ ఆ సభ్యులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details