తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

టాప్​ టెన్​ న్యూస్​ @1PM
టాప్​ టెన్​ న్యూస్​ @1PM

By

Published : Feb 23, 2021, 12:54 PM IST

1.లాయర్​ను చంపేందుకు..

కేసు ఓడిపోయాడని ఓ న్యాయవాది‌పై హత్యాయత్నం చేశారు కక్షిదారులు. తుపాకీతో గురిపెట్టి.. కత్తితో బెదిరించి చంపబోయారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వారు వెనక్కు తగ్గారు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.సజీవదహనం

ఏపీలోని అనంతపురం జిల్లాలో తల్లీకుమారులను కరెంటు రూపంలో మృత్యువు కాటేసింది. తల్లికుమారులిద్దరూ ద్విచక్రవాహనంపై తోటకు వెళ్తుండగా... పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి వద్ద విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'రైతులను కాపాడుకుంటాం'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రైతుల సమస్యలను శాసనసభలో వినిపించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.తమిళిసై నిర్ణయంపై ఉత్కంఠ

పుదుచ్చేరిలో ప్రభుత్వం కూలిపోయాక ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై కేంద్రీకృతమై ఉంది. ఆమే ఏ నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగుతోంది. తమిళిసై నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న వేళ రాజ్యాంగ పదవిలో ఉన్న ఆమె ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'ఆరోగ్య భారత్​కు నాలుగు సూత్రాలు'

భారత ఆరోగ్య రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరిందని మోదీ అన్నారు. వార్షిక బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు అద్భుతమని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతో ఉండాలని కరోనా సంక్షోభం గుణపాఠం నేర్పిందన్నారు. బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపుల అమలుపై వెబినార్​లో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'7వేలకు పైగా మ్యుటేషన్లు'

ఏడు వేలకు పైగా కరోనా వైరస్​ ఉత్పరివర్తనాలు దేశంలో ఉన్నాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. అందులో పలు మ్యుటేషన్లు తీవ్ర ఇబ్బందుల్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రచురితమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.రైతు నేత అరెస్ట్​

జనవరి 26న ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు సంబంధించి జమ్ముకశ్మీర్​ రైతు సంఘం ప్రముఖ నేతతో పాటు మరో యువకుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఈ కేసులో కీలక నిందితులని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.అమెరికా కీలక ప్రకటన

భారత్​తో వైద్య రంగంలో భాగస్వామ్యం మెరుగుపర్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సహకారం కరోనాపై పోరాడేందుకు ఉపయోగపడిందని పేర్కొంది. విద్యుత్ రంగం సహా, పర్యావరణ మార్పులపైనా భారత్​తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.క్రికెట్​పై 'మాస్టర్​' క్లాసులు

క్రికెట్​ కెరీర్​లో తన అనుభవాలను నేటితరం ఆటగాళ్లతో పంచుకునేందుకు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ సిద్ధమయ్యాడు. అన్​-అకాడమీ డిజిటల్​ వేదికగా క్రికెట్​ గురించి ఉచిత ఆన్​లైన్​ సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఆసక్తి ఉన్నవారు ఉచితంగా ఈ సెషన్లలో చేరవచ్చని సచిన్​ వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సుజిత్​ కొత్త సినిమా

'సాహో' ఫేమ్ సుజిత్​ తన కొత్త సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. జీ స్టూడియోస్​ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. పవర్​ఫుల్​ యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో రూపొందనుందీ సినిమా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details