తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

etv bharat telugu top ten news
టాప్​టెన్​ న్యూస్​@7PM

By

Published : Nov 19, 2020, 7:00 PM IST

1.'సహించం'

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఎంఐఎం సహా ఎవరితోనూ పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠంపై తెరాస అభ్యర్థే ఉంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో అరాచకం కావాలా.. అభివృద్ధి కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. హైదరాబాద్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని.. ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.రేపటి నుంచే పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాల కోసం సర్వం సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో పుష్కరాలను ఘనంగా ప్రారంభించనున్నారు. నాలుగు చోట్ల ఘాట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనల అమలు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 2న ఖమ్మానికి కేటీఆర్​

అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, నిరంజన్​ రెడ్డి, మహమూద్​ అలీ ఖమ్మం వస్తారని మంత్రి అజయ్​ కుమార్​ వెల్లడించారు. నగరంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు చేత ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ప్రమాణం చేసిన 3 రోజులకే..

నితీశ్​ కుమార్​ ప్రభుత్వంలో 3 రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్​ చౌధరీ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఆవిష్కరణ

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశంలోని వర్తమాన పరిస్థితులకు ఈ పుస్తకాలు అద్దం పడతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.10 ఏళ్ల జైలు

2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్​ ఉద్​ దవా చీఫ్ హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్​ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన రెండు కేసులకు సంబంధించి యాంటీ-టెర్రరిజం కోర్టు ఈ తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.చైనా భయపడుతోందా?

ప్రపంచ స్థాయిలో భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి పొరుగు దేశం చైనా భయపడుతున్నట్లే కన్పిస్తోంది. భారత్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌కున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూస్తోంది. ఇందుకోసం చైనా అనేక పన్నాగాలు పన్నుతోందని అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ విభాగానికి చెందిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.దిగొస్తున్న పసిడి ధరలు

పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం దాదాపు రూ.250 తగ్గింది. వెండి ధర కిలోకు భారీగా తగ్గి.. రూ.61,200 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఎలా ప్రపోజ్​ చేశారంటే?

ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న భారత దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​.. 'నో ఫిల్టర్​ నేహా' చాట్​ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భార్య రోమికి అప్పట్లో తన ప్రేమను ఎలా తెలియజేశానో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సినీ 'నకిలీ' బాబాలు

క్రైమ్, సస్పెన్స్​, కామెడీ, డ్రామా​.. ఇవే వెబ్​సిరీస్​లను ఏలుతున్న పదాలు. మరి నకిలీ బాబాలకు ఆ కథలతో లింక్​ పెడితే ఎలా ఉంటుంది? అదే ఫార్ములాతో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, సిరీస్​లు వస్తున్నాయి. వెండితెర నుంచి ఓటీటీ వరకూ విడుదలైన ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులూ బ్రహ్మరథం పడుతున్నారు. వాటిల్లో హైలెట్​గా నిలిచిన కొన్నింటి విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details