తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@7PM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

etv bharat telugu top ten news
టాప్​టెన్​ న్యూస్​@7PM

By

Published : Nov 18, 2020, 6:59 PM IST

1.కాంగ్రెస్​ తొలి జాబితా

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 22 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా విడుదల చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గాంధీభవన్​లో సమావేశమైన ప్రత్యేక కమిటీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'కేంద్రంపై దేశవ్యాప్త పోరు'

భాజపాపై దేశవ్యాప్త పోరుకు తెరాస సిద్ధమైంది. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత డిసెంబర్ రెండో వారంలో జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.24 గంటల్లోనే..

వరద సాయానికి ఎన్నికల కోడ్​ అడ్డంకి కాదని బుధవారం ప్రకటించిన ఎన్నికల సంఘం... నిలిపివేయాలని ఇవాళ ఆదేశించింది. ఎన్నికల కోడ్​ ఉన్నప్పుడు ఇలా సాయం చేయడంపై పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు సాయం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ గతంలో లేఖ రాసింది. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించాలంటూ.. తాజాగా కృష్ణా బోర్డు ఏపీ జలవనరుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల డీపీఆర్​లు అందించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.చితక్కొట్టారు..

నగరంలోని టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో చిన్నారి వద్ద నుంచి వంద రూపాయలు లాక్కెళ్తుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.ఫైజర్​ మరో కీలక ప్రకటన

అమెరికా సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలను ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్​ తుది విశ్లేషణలో 95 శాతానికిపైగా ప్రభావవంతంగా తమ వ్యాక్సిన్ పనిచేసిందని ఫైజర్​తో పాటు దాని భాగస్వామి బయోఎన్​టెక్​ వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.భారత్​లోనే రికవరీలు ఎక్కువ

దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసులకంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నెలన్నర రోజులుగా ఇదే విధానం కొనసాగుతోందని వివరించింది. భారత్​లో ప్రస్తుత రికవరీ రేటు 93.52శాతంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ట్విట్టర్​ క్షమాపణలు

'చైనాలో లద్దాఖ్'​ను చూపి భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్​ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్​కు లిఖితపూర్వక అఫిడవిట్​ అందజేసినట్లు కమిటీ ఛైర్​పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.' అదో జిమ్మిక్కు'

బిగ్​బాష్​ లీగ్​లో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. ఆటను తప్పుదారి పట్టింటే ప్రయత్నాలని ఆరోపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్‌. వాటిని ప్రాథమిక దశలో పరిశీలించకుండా నేరుగా లీగ్​లో ప్రవేశపెట్టడం తనను నిరాశకు గురిచేసిందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.వెండితెరపై 'టామ్​ అండ్​ జెర్రీ'

టామ్​ అండ్​ జెర్రీ అభిమానులకు గుడ్​న్యూస్​. ఇప్పటివరకు బుల్లితెరపైనే అలరించిన ఈ క్యారెక్టర్లు త్వరలో వెండితెరపై సందడి చేయనున్నాయి. వచ్చే ఏడాది భారత్​లో ఇంగ్లీష్​, హిందీ భాషల్లో ఈ జంతువుల అల్లరి కనువిందు చేయనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్​ విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details