ఆఖరి నిమిషంలో చంద్రయాన్ -2 ఆపడం సరైన నిర్ణయమే అంటున్నారు అంతరిక్ష రంగ నిపుణులు. ఇలాంటి క్లిష్టమైన ప్రయోగాల్లో సాంకేతిక సమస్యలు రావడం సహజమేనంటున్నారు బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ. మళ్లీ ప్రయోగం వెంటనే సాధ్యం కాకపోవచ్చునని.. కొన్ని వారాల పాటు సమయం పడుతుందని తెలిపారు. ప్రయోగం చేపట్టిన తర్వాత సమస్య వస్తే అనేక ఇబ్బందులు వచ్చేవని చెబుతున్న సిద్ధార్థతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ...
'ఆఖరి నిమిషంలో ఆపడం మంచిదైంది' - gslv
చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోవడం ఒకందుకు మంచిదేనంటున్నారు బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ. ప్రయోగం జరిపితే.. తరువాత అనేక ఇబ్బందులు వచ్చేవని తెలిపారు. ఇస్రో ఆఖరి గంటలో సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.
birla science center director bg siddartha