రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఖండిస్తూ... ఈఎస్‌ఐ ఐక్యకార్యచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ... ఐకాస నేతలు హైదరాబాద్ నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.
'నేడు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిరసన' - esi news
ఈఎస్‌ఐని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఖండిస్తూ ఈఎస్‌ఐ ఐక్యకార్యచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద నిరసన తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిరసన చేపట్టాలని ఐకాస నిర్ణయించింది.
'రేపు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిరసన'
ఈ అంశంపై సీఎం కేసీఆర్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చొరవ చూపాలని కోరారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ... గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని ఐకాస పిలుపునిచ్చింది.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే