ఐఎంఎస్ కుంభకోణంలో మాజీ సంచాలకురాలు దేవికారాణితోపాటు మరో ఎనిమిది మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అవసరం లేకున్నా ఔషధాలు కొనుగోలు చేయడం, మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.
దాదాపు రూ.6.5 కోట్లు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో భీమా వైద్య సేవల విభాగానికి చెందిన అధికారులు.. దేవికారాణి, కల్వకుంట్ల పద్మ, వసంత ఇందిర, ఓమ్నీ మెడి నిర్వాహకుడు బాబ్జీతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.