తెలంగాణ

telangana

ETV Bharat / city

Grand Nursery Mela in Hyderabad: ఉత్సాహంగా సాగుతున్న "జాతీయ ఉద్యాన ప్రదర్శన" - Grand Nursery Fair

Grand Nursery Mela in Hyderabad : హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న గ్రాండ్ నర్సరీ మేళా ఉత్సాహంగా సాగుతోంది. ఇంటికి శోభనిచ్చే పూలమొక్కలు, విభిన్న రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, సరికొత్త పద్ధతులను పరిచయం చేస్తోంది. ప్రకృతి ప్రేమికులు ప్రదర్శనకు పోటెత్తున్నారు.

Enthusiastically going on Grand Nursery Mela in Hyderabad
Enthusiastically going on Grand Nursery Mela in Hyderabad

By

Published : Feb 25, 2022, 5:46 AM IST

ఉత్సాహంగా సాగుతున్న "జాతీయ ఉద్యాన ప్రదర్శన"

Grand Nursery Mela in Hyderabad :హైదరాబాద్‌లో 11వ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన కళకళలాడుతోంది. P.V.నరసింహారావు మార్గ్‌లో ఉద్యానవనశాఖ సహకారంతో 'తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ' ఆధ్వర్యంలో 5 రోజులపాటు జరగనున్న ఈ మెగా గ్రాండ్ నర్సరీ మేళాను గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల నుంచి ప్రముఖ నర్సరీలు, సంస్థలు, అంకుర కేంద్రాలు ఆధ్వర్యంలో... 120పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువుదీరాయి. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ, సుంగధ ద్రవ్యాల విత్తనాలు, మొక్కలు, అలంకరణ మొక్కలు, పనిముట్లు, సేంద్రీయ, జీవన ఎరువులు ఆకట్టుకుంటున్నాయి.

నగర సేద్యం రోజురోజుకు పెరుగుతుండటంతో... టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌తోపాటు వినూత్న సాగు కోసం నగరవాసులు పెద్దఎత్తున ప్రదర్శనకు తరలివస్తున్నారు. గార్డెనింగ్‌ యూనిట్ల ఏర్పాటు, చీడపీడల నివారణ పట్ల జాగ్రత్తలను.. అంకుర సంస్థలు వివరిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి మొక్కల సేకరిస్తుండగా... ఈ ప్రదర్శనలో ఎన్నో రకాలు అందుబాటులో ఉండటం పట్ల.... నగరవాసులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు.

ఈ నెల 28 వరకు జరగనున్న ఈ జాతీయ ఉద్యాన మేళా సందర్శనకు 20 రూపాయల రుసుం వసూలు చేస్తుండగా.... నగర సేద్యం ప్రోత్సహించేందుకు టెర్రస్‌, కిచెన్‌ గార్డెన్‌ నిర్వాహకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అలాగే, విద్యార్థులకు 50శాతం రాయితీపై కల్పించారు.

ఇదీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details