తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆక్సిజన్​ కోసం రైల్వే ద్వారా ఒడిశాకు ఖాళీ ట్యాంకర్లు

ఆక్సిజన్​ కోసం ఇప్పటి వరకు పక్కరాష్ట్రాలకు ఖాళీ ట్యాంకర్లను యుద్ధవిమానాల ద్వారా పంపగా... ఇప్పుడు రైల్వే ద్వారా పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ జెండా ఊపి ట్యాంకర్లను ఒడిశాకు పంపించారు. ఈ పద్దతి ద్వారా రెండున్నర రోజుల్లోనే ఆక్సిజన్​ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

Empty oxygen tankers to Odisha on the railway line
Empty oxygen tankers to Odisha on the railway line

By

Published : Apr 28, 2021, 9:56 PM IST

కొవిడ్ రోగులకు చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్​ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులు... రైల్వే ద్వారా ట్యాంకర్లను ఒడిశాకు పంపారు. సికింద్రాబాద్ నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లను రైల్వే మార్గం ద్వారా పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జెండా ఊపి ట్యాంకర్లను ఒడిశాకు పంపించారు. ఇది మంచి ఫలితాన్ని ఇస్తే రోజు ఆరు నుంచి పది ట్యాంకర్ల వరకు పంపవచ్చని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ఇప్పటి వరకు యుద్ధవిమానాల ద్వారా ఖాళీ ట్యాంకర్లను పంపగా... ఆక్సిజన్​తో రహదారి మార్గాన ట్యాంకర్లు వచ్చేవి. ఇందుకోసం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. అయితే రైల్వే మార్గం ద్వారానే ట్యాంకర్లను పంపి... తిరిగి రైల్వే ద్వారానే తీసుకురావడం ద్వారా రెండున్నర రోజుల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ABOUT THE AUTHOR

...view details