తెలంగాణ

telangana

ETV Bharat / city

నల్లపాడు, పేరిచర్ల మధ్య విద్యుద్దీకరణ, డబ్లింగ్​ పూర్తి

ఏపీ గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్​, విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా నల్లపాడు-పేరిచర్ల స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ, డబ్లింగ్​ లైను పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. 7.8 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపింది. మిగిలిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించింది.

electrification and doubling works completed on nallapadu pericherla stations
నల్లపాడు, పేరిచర్ల మధ్య విద్యుద్దీకరణ, డబ్లింగ్​ పూర్తి

By

Published : Dec 3, 2020, 7:35 PM IST

ఏపీ గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా నల్లపాడు-పేరిచర్ల స్టేషన్‌ల మధ్య విద్యుద్దీకరణ పనులతో పాటు డబ్లింగ్ లైను పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య 7.8 కిలో మీటర్ల పొడవు విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు పూర్తయ్యాయయని పేర్కొంది.

గుంటూరు-గుంతకల్లు మధ్య 404 కిలోమీటర్ల పొడవు లైనుకు విద్యుద్దీకరణతో పాటు డబ్లింగ్ ప్రాజెక్టుకు 2016-17 సంవత్సరంలో ప్రభుత్వం రూ. 3,887కోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేసింది. ఇంతకు ముందే పేరిచర్ల-సాతులూరు 24 కి.మీ దూరం, డోన్-పెండేకల్లు 28 కి.మీ దూరం పనులను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం గుంటూరు - గుంతకల్లు సెక్షన్‌లో మొత్తం 59.8కి.మీ పొడవున పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

ఇదీ చదవండి:సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా​

ABOUT THE AUTHOR

...view details