రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడి.. కరోనా బాధితులకు ప్రాణ సంకటం కలగకుండా విద్యుత్‌శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరోనా చికిత్స చేసే ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని కీలకమైన ఆసుపత్రులకు రెండు సబ్‌స్టేషన్‌ల నుంచి విద్యుత్ లైన్‌లను సిద్ధం చేశారు. ఒక లైన్‌లో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి తక్షణమే కరెంట్ అందిస్తారు.
24 గంటల కంట్రోల్ రూమ్..
నిమ్స్, టిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రుల్లో 24 గంటలపాటు నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించారు. విద్యుత్ సౌధ ప్రధాన కార్యాలయంలోనూ జెన్కో, ట్రాన్స్‌కో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి... 24 గంటలు అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇంతచేసినా అకాల వర్షాల ముప్పుతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.