బల్దియా ఎన్నికల బరిలో సుమారు 80 మంది వరకు కొత్త అభ్యర్థులు తలపడ్డారు. పార్టీలు మారినా పట్టువదలకుండా ప్రయత్నించి మరికొందరు విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్‌గూడ, వెంగళ్‌రావునగర్, రహ్మత్‌నగర్ స్థానాల్లో మొదటిసారి పోటీ చేసిన తెరాస యువ అభ్యర్థులు రాజ్‌కుమార్, దేదీప్య, సి.ఎన్.రెడ్డి విజేతలుగా నిలిచారు. మోండామార్కెట్ డివిజన్‌లో భాజపా అభ్యర్థి దీపిక బలమైన ప్రత్యర్థులను ఢీకొని గెలుపొందారు. అమీర్‌పేట, అత్తాపూర్, చర్లపల్లి, రామంతాపూర్, ఉప్పల్ చిలకానగర్, మియాపూర్, చందానగర్, హబ్సిగూడ తదితర స్థానాల్లో విజయం సాధించినవారు కూడా మొదటిసారిగా రాజకీయ ఓనమాలు నేర్చినవారే కావటం విశేషం.
బల్దియా పోరు : ఆ అభ్యర్థుల విజయమిచ్చిన కిక్కే వేరప్పా!
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. గెలుపు పక్కా అనుకున్న అభ్యర్థుల్లో కొందరు చివరకు ఓటమి భారంతో వెనుదిరగాల్సివస్తే.. 80మంది కొత్తవారు గెలుపొందారు. మరికొందరు పార్టీలు మారినా పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి విజయం సాధించారు.
పార్టీలు మారుతూ సీటు సంపాదించినా పలుమార్లు పరాభవం తప్పలేదు. అయినా ప్రయత్నిస్తూ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 20-35 మంది అభ్యర్థులు పలు మార్లు ఎన్నికల బరిలో పోరాటాలు చేసి ఇప్పుడు విజయాన్ని అందుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్‌లో కొప్పుల నర్సింహారెడ్డి 2016లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన భాజపాలోకి చేరి గెలుపు దక్కించుకున్నారు. ముషీరాబాద్ డివిజన్‌లో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుప్రియ నవీన్‌గౌడ్ ఈదఫా భాజపా అభ్యర్థిగా గెలుపొందారు.