సీఎస్‌తో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి భేటీ
ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎస్ ఎస్కే జోషితో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలను వివరించినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్లోబరీనా సంస్థపై వచ్చిన ఆరోపణల విషయమై కమిటీ విచారణ చేస్తోందని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్లోబరీనా సంస్థపై వచ్చిన ఆరోపణల విషయమై కమిటీ విచారణ చేస్తోందని.. మూడు రోజుల్లో నివేదిక వస్తుందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సందేహాలు ఉన్నవారు రీ కౌటింగ్‌కు రూ. 100, రీ వెరిఫికేషన్‌కు రూ. 600 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష పత్రాల నకలు విద్యార్థులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 9 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జనార్దన్ రెడ్డి.ఇవీ చూడండి: విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీష్ రెడ్డి