edcet results 2021: ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 98.53 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత - telangana edcet notification
16:22 September 24
ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 98.53 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 98.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షలో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. అందులో 25,983 మంది అమ్మాయిలున్నట్టు వెల్లడించారు.
ఎడ్‌సెట్‌లో నల్గొండకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్‌కు మొదటి ర్యాంకు, మంచిర్యాలకు చెందిన ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మ మూడో ర్యాంకు సాధించారు.