తెలంగాణ

telangana

ETV Bharat / city

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. హైదరాబాద్​లో మరోసారి సోదాలు - దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు

ED raids in Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా మరోసారి హైదరాబాద్ బషీర్ బాగ్​లోని ఈడీ కార్యాలయం నుంచి నాలుగు బృందాలుగా అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తోంది.

ED raids
ED raids

By

Published : Sep 19, 2022, 1:15 PM IST

Updated : Sep 19, 2022, 5:05 PM IST

ED raids in Hyderabad: జాతీయస్థాయిలో సంచలనంగా మారిన దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి నాలుగు బృందాలుగా అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తోంది. 10రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు రెండోసారి సోదాలు జరిపారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, మాదాపూర్‌లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎమ్మెల్యే కాలనీలో నివాసముండే వెన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో ఈడీ రెండు గంటలపాటు సోదాలు జరిపింది. అధికారులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. రామచంద్రపిళ్లై చెప్పిన సమాధానం మేరకు ఈడీ అధికారులు శ్రీనివాసరావును ప్రశ్నించారు. పూర్తి గోప్యత పాటిస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా 40చోట్ల తనిఖీలు జరపగా... తెలుగు రాష్ట్రాలు సహా చెన్నైలోని 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి... స్థానిక అధికారుల సహకారంతో తనిఖీలకు వెళ్లారు. లిక్కర్‌ పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తుండగా... ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్' చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. తాజాగా మరోసారి దాడులను ఉద్ధృతం చేశారు.

ED raids in Hyderabad over Delhi liquor scam : ఇందులో భాగంగానే ఈ నెల 6న దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ హైదరాబాద్‌లో సోదాలు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్​లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఈడీ అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్​లో డైరెక్టర్​గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్​గా ఉన్నారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. కోకాపేట్​లోని రాంచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు జరిగాయి. పలువురి రాజకీయ ప్రముఖులతో రాంచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించారు.

రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి సహడైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ బోయినపల్లికి మరో 9 సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇందులో అనూస్ ఎలక్ట్రోలిసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒకటి. మాదాపూర్ జూబ్లీఎన్ క్లేవ్‌లోని ప్రణవ అలేఖ్య హోమ్స్‌లో ఉన్న దీని కార్పొరేట్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే మద్యం సరఫరా సంస్థలకు ఆడిటింగ్ కార్యకలాపాలు నిర్వహించిందని భావిస్తున్న.. దోమల్‌గూడ, అరవింద్‌నగర్‌లోని శ్రీసాయి కృష్ణా రెసిడెన్సీలో ఉన్న గోరుంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరుంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో తనిఖీలు జరిపారు. ఇదే సంస్థకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 19, 2022, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details