తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని ఈసీ ఆదేశం - MLA Raja Singh Response

EC orders registration of FIR against MLA Raja Sing  for intimidating voters
EC orders registration of FIR against MLA Raja Sing for intimidating voters

By

Published : Feb 19, 2022, 8:04 PM IST

Updated : Feb 19, 2022, 8:31 PM IST

20:02 February 19

ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని ఈసీ ఆదేశం

FIR against MLA Raja Sing: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడే విషయంలో కూడా ఈసీ నిషేధం విధించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్​కు మద్దతుగా రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోనే ఇందుకు కారణం. ఈ వీడియో విషయంలో ఇప్పటికే రాజాసింగ్​కు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వీడియో సందేశంపై వివరణ ఇవ్వాలని రాజాసింగ్​ను ఈసీ బుధవారం ఆదేశించింది. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవటం వల్లే ఎఫ్​ఐఆర్​కు ఈసీ ఆదేశించింది.

నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే..

యూపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్​ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. సదరు వీడియోలో రాజాసింగ్​ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించినట్టుగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. రాజాసింగ్​కు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పూర్తి కథనం కోసం..EC notice to Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు.. 24 గంటల్లో..

నోటీసులపై రాజాసింగ్​ ఎమన్నారంటే..

ఈసీ నోటీసులపై వెంటనే స్పందించిన రాజాసింగ్​.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్​ మరోసారి సీఎం కావాలని రాజస్థాన్‌ ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఈసీకీ వివరణ ఇస్తానని వెల్లడించారు. పూర్తి కథనం కోసం..MLA Raja Singh Response: ఈసీ నోటీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్​ ఏమన్నారంటే..?

వీడియోలో ఏముందంటే..

అసలు ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోలో ఏముంది..? ఆయన ఓటర్లను ఉద్దేశించి ఏమన్నారు..? బెదిరించే వ్యాఖ్యలు ఏంచేశారు..? పూర్తి కథనం కోసం..Raja Singh Controversy: 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు'

Last Updated : Feb 19, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details