జేఎన్టీయూలో ప్రశాంతంగా ఎంసెట్ ప్రవేశ పరీక్ష - eamcet exam
హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతగా సాగుతోంది. కొవిడ్ నిబంధనల మధ్య పరీక్ష నిర్వహిస్తున్నారు.
eamcet exam started in hyderabad jntu
హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో ఎంసెట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉండటం వల్ల విద్యార్థులు ఏడున్నర గంటలకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కొవిడ్ దృష్ట్యా... సెంటర్ వద్ద భద్రతా సిబ్బంది మూడు దశల్లో థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియ చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు. ప్రశాంత వాతావరణంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు సాగుతున్నాయి.