తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. పవిత్ర దసరా పండుగను రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు - congress leaders latest
దసరా పండుగను రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
మాజీ ఎంపీలు మధుయాస్కీ, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇదీ చూడండి:ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఒత్తిడి చేశారు: ఎల్.రమణ