తెలంగాణ

telangana

ETV Bharat / city

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల పుష్కరిణిలో జపయజ్ఞం - solar eclipse updates

సూర్యగ్రహణం వేళ శ్రీవారి పుష్కరిణిలో తితిదే జప యజ్ఞం నిర్వహించింది. భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారి సేవకులు జపయజ్ఞంలో పెద్దఎత్తున పాల్గొన్నారు.

during-the-solar-eclipse-conducted-the-japa-yagnam-in-tirumala
సూర్యగ్రహణం సందర్భంగా పుష్కరిణిలో జపయజ్ఞం

By

Published : Jun 21, 2020, 12:58 PM IST

సూర్యగ్రహణం వేళ తిరుమల క్షేత్రం వేదమంత్రాలతో ప్రతిధ్వనించింది. శ్రీవారి పుష్కరిణిలో తితిదే జప యజ్ఞం నిర్వహించింది. ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ప్రముఖ వేద పారాయణదారులు, తితిదే సిబ్బంది ఆధ్వర్యంలో జప యజ్ఞం సాగింది. భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారి సేవకులు జపయజ్ఞంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. గ్రహణ సమయంలో జపయజ్ఞం నిర్వహించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ABOUT THE AUTHOR

...view details