తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ లేఖ

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్​ తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలని ఎంపీ డి.శ్రీనివాస్​ కోరారు. ప్రజల ఇబ్బందులు, కార్మికుల సమస్యలు వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సమస్య జటిలం కాకముందే నిర్ణయం తీసుకోవాలన్నారు.

కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ లేఖ

By

Published : Nov 9, 2019, 8:02 AM IST

బస్సులు లేక రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ అన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ డి.శ్రీనివాస్‌ కోరారు. సమస్య జటిలం కాకముందే పరిష్కరించాలని ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. సంస్థ మనుగడ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని అభివర్ణించారు.

ఉద్యోగభద్రత పేరుతో మెడపై కత్తి పెట్టినా కార్మికులు తలవంచలేదని డీఎస్‌ పేర్కొన్నారు. ‘‘ఆర్టీసీ ఆస్తుల విభజన, పంపకం పూర్తిగా జరగక ముందే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఆర్టీసీని ప్రైవేట్​ పరం చేయడం సరికాదన్నారు. పంతాలకు పోకుండా కార్మికులతో చర్చలు జరిపి, న్యాయమైన డిమాండ్లను అంగీకరించాల్సిందిగా కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: నేడు ఆర్టీసీ కార్మికుల 'ఛలో ట్యాంక్​ బండ్'​

ABOUT THE AUTHOR

...view details