Traffic Rules: ప్రశ్న : మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఏ కారణాల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి...? డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఎలా ఉంది..?
జవాబు : ఏమాత్రం రూల్స్ తెలియని వారికి కూడా రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేస్తోంది. యూరఫ్, అమెరికా వంటి దేశాల్లో లైసెన్స్ పొందాలంటే అనేక పుస్తకాలు చదవాలి. శిక్షణ తీసుకోవాలి. అప్పుడు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ సమగ్రంగా తెలిసిన వారికే అక్కడ లైసెన్స్ వస్తుంది. ఇక్కడ మాత్రం అలా కాదు.. ఎటువంటి రూల్స్ తెలియకుండానే బండ్లు బయటకు తీస్తున్నారు. ఆధార్ కార్డు మన హక్కు కానీ.. డ్రైవింగ్ లైసెన్స్ మన హక్కు కాదు. మనం రూల్స్ నేర్చుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కూడా రావాలి.
ప్రశ్న : ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేయాలని మీరు భావిస్తున్నారా?
జవాబు : ఎవరు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నా.. సరే వారికి ఇవ్వాలనే ఆలోచనలో రవాణాశాఖ అధికారులు ఉన్నారు. లైసెన్స్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకూడదు. అక్కడ కొంచెం ఫిల్టర్ చేసి కంట్రోల్ చేస్తే ప్రజల్లో కూడా అవగాహన వస్తుంది.
ప్రశ్న : ఇప్పటికే లైసెన్స్ తీసుకునే విధానంలో పరీక్షలు పెడుతున్నారు. వాహనాలకు డ్రైవింగ్ టెస్ట్ పెడుతున్నారు. అయినప్పటీకీ వాహనదారుల్లో మార్పు రావడంలేదంటే... అందులో లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా...?
జవాబు :చాలా మంది పరీక్షలు రాసేప్పుడు ఏజెంట్లను మధ్యవర్తులను సంప్రదిస్తున్నారు. వాళ్ల సహాయంతో పాస్ అవుతున్నారు. వాహన డ్రైవింగ్ కూడా ఒక చిన్న గ్రౌండ్లో ఉంటుంది. కానీ.. బయట దేశాల్లో ఆ విధంగా ఉండదు. రోడ్డుమీదనే డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ రావడం సగం... ట్రాఫిక్ రూల్స్ తెలియడం మరో సగం మొత్తం కలిపితేనే సంపూర్ణం అవుతుంది.
ప్రశ్న : పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరు ప్రమాదాల బారిన పడకుండా ఏవిధంగా అవగాహన కల్పించాలి...?