తెలంగాణ

telangana

ETV Bharat / city

విమానాశ్రయం పరిసరాల్లో అధికారుల నిఘా.. విస్తృత తనిఖీలు - అధికారుల నిఘా

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోని.. హోటళ్లపై స్థానిక పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు నిఘా పెంచారు. స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు ఈ హోటళ్లు స్థావరాలుగా మారినట్లు భావిస్తున్న అధికారులు... అప్రమత్తమయ్యారు. విదేశీయులకు పాస్‌పోర్టు జిరాక్స్‌... స్థానికులు, స్థానికేతరులకు ఆధార్‌కార్డు జిరాక్స్‌ తప్పనిసరని... హోటళ్ల యాజమాన్యాలకు పోలీసులు స్పష్టం చేశారు.

Dri Police Alert On Smuggling in shamshabad airport
Dri Police Alert On Smuggling in shamshabad airport

By

Published : Jun 15, 2021, 5:04 AM IST

శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా బయట దేశాల నుంచి అక్రమంగా తెస్తున్న బంగారం, మాదకద్రవ్యాలు, విదేశీ కరెన్సీ లాంటివి చేతులు మారేందుకు స్థానిక హోటళ్లు స్థావరాలుగా మారాయి. ఈ నెల 5న ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ఒక మహిళా ప్రయాణికురాలు రెండు రోజుల శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులకు... విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా... తన లగేజిని తీసుకోవడానికి వచ్చిన మహిళను అనుమానంపై విచారించారు. ఆ సందర్భంగా ఆమె లగేజీని తనిఖీ చేయగా అందులో 4 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఆమె లగేజీ కంటే ముందే వచ్చి ఇక్కడ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మరో మహిళా ప్రయాణికురాలు కూడా మాదకద్రవ్యాలతో అదే విమానాశ్రయానికి వస్తున్నట్లు తెలుసుకుని కాపుకాచి... వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె లాగేజిని తనిఖీ చేయగా 8 కిలోల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాళ్లను మరింత లోతుగా విచారణ చేయగా... డీఆర్​ఐఅధికారులకు కొత్త విషయాలు తెలిశాయి. బయట దేశాల నుంచి అక్రమంగా తెచ్చే బంగారం కానీ, మాదకద్రవ్యాలు కానీ ఈ హోటళ్లలోనే చేతులు మారుతున్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి డీఆర్​ఐఅధికారులు తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు, డీఆర్​ఐ అధికారులు నిఘా పెంచారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లోని హోటళ్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు.

త్వరలో హోటళ్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి.. నేరస్థులకు సంబంధించి అవగాహన కల్పించడంతోపాటు.. పాటించాల్సిన నియమ నిబంధనలను పోలీసులు అమలు చేయనున్నారు.

ఇదీ చూడండి: Jagadish reddy: హంపి కథపై నోరు విప్పిన మంత్రి జగదీశ్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details