వైద్యరంగంలో మరింత పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని డీఆర్డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. వైద్య కళాశాల విద్యార్థులతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. వైద్యరంగంలో ప్రయోగాలు చేయాలనుకునే ఈఎస్ఐ వైద్య కళాశాల విద్యార్థులు.. డీఆర్డీఓ ల్యాబ్‌లలో పనిచేసేందుకు వీలుగా ఒప్పందాలు చేయనున్నట్టు ప్రకటించారు.
'వైద్య పరికరాలను తక్కువ ధరలకే అందించాలి'
వైద్య పరికరాలను మరింత తక్కువ ధరలకే సాధారణ ప్రజలకు అందించాల్సిన అవసరముందని డీఆర్డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ఆ దిశగా డీఆర్డీఓ కృషి చేస్తోందని తెలిపారు.
వైద్యరంగంలో పరిశోధనలపై డీఆర్డీఓ ఛైర్మన్
దేశంలోనే మొట్టమొదటి బీఎస్4 ల్యాబ్‌ను డీఆర్డీఓ త్వరలో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. డీఆర్డీఓ తయారు చేసిన కాంక్లియార్ ఇంప్లాంట్‌ని ఇప్పటికే ఐదుగురు రోగులకు అమర్చి.. వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు వివరించారు. కొవిడ్ సమయంలో ఈఎస్ఐతో కలిసి అనేక ప్రయోగాలు చేశామన్న సతీశ్ రెడ్డి.... భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని కొనసాగించనున్నట్టు వివరించారు.
- ఇదీ చూడండి :భారత్‌లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం!